Friday, May 22, 2009

బాల సాహితి BALA SAHITI


కవిత

ఉయ్యాల


- సి. విజయేంద్ర బాబు, 4వ తరగతి


పార్కులో ఉయ్యాల ఊగుతున్నప్పుడు


గాలిలో తేలుతున్నట్టు


నింగిలో ఎగురుతున్నట్టు


విమానాలను పట్టుకున్నట్టు


పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు


ఎన్నెన్నో అనుభవాలు...


అలా చూస్తూ ఉంటే పచ్చని చెట్లు


దూరాన ఉన్న కొండలు అన్నీ


నా కళ్ళముందే ఉన్నట్టనిపిస్తుంది


పచ్చని చెట్లపై కిలకిలరవాలు చేస్తున్న పక్షుల్లా


మనసంతా ఆనందమయమే.



Friday, May 15, 2009

బాలసాహితి BALASAHITI


చిన్న కథ


కొంగ ఆలోచన



సి. శ్రీవైష్ణవి, ఒకటవ తరగతి.


ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక కొంగ ఉండేది. ఆ కొంగ ఒక సారి ఒక మృగాన్ని చూసింది. చూసి బయపడింది. ఆ మృగం కొంగని తినేద్దామా అనుకుంది. ఆ కొంగ పరిగెత్తి పోదామనుకుంది. ఆ కొంగకి దాహం వేసింది. నీళ్ళు తాగి పోదామనుకుంది. ఇంతలోనే ఆ మృగం ఆ కొంగని తినేసింది.


నీతి – ఆలోచించిన ప్రకారం చేయాల్సిన పని వెంటనే చేయాలి. ఆ కొంగ అనుకున్న వెంటనే ఎగిరిపోయి ఉండాల్సింది.

Monday, May 11, 2009

బాలసాహితి BALASAHITI







చిన్న కథ




కనువిప్పు




- మాస్టర్ సి. విజయేంద్ర బాబు





ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతడు చాలా సోమరిగా ఉండేవాడు. అతడికి చాలా పెద్ద పొలాలు ఉన్నాయి. అతడి పేరు రంగన్న. అతడు రోజూ పని చేసేవాడు కాడు. అతడు రోజూ ప్రోద్దున నుంచి రాత్రి దాకా నీరు మాత్రం వదిలేవాడు. ఒక సారి అలాగే నీరు వదిలేందుకు రంగన్న, అతని కొడుకు పొలానికి వెళ్ళినపుడు ఉన్నట్టుండి పెద్దగా వాన కురిసింది. అక్కడ గుంతలలో నీరు నిండిపోవడంతో రంగన్న అతని కొడుకు మునిగిపోయారు.


అదే సమయానికి దగ్గరలో ఉన్న వారి స్నేహితులు ఇది గమనించి వారిద్దరినీ బయటికి తీసి ఆసుపత్రి లో చేర్చారు. కోలుకున్న తరువాత రంగన్నకు కనువిప్పు కలిగింది. తమకు రోజూ పనిచేసే అలవాటు లేక, సోమరిగా ఉండటము వలన ప్రమాదము ఎదుర్కోవలసి వచ్చిందని తెలుసుకున్న రంగన్న, అతడి కొడుకు కష్టపడి పని చేయడం మొదలుపెట్టారు.

నీతి:- ఎప్పుడూ సోమరిగా ఉండకూడదు. అలా ఉంటే కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.

Tuesday, May 5, 2009

Saturday, May 2, 2009

కవిత

మేడే


- డా. ఎస్. బషీర్, చెన్నై.


అరుణిమ కాంతులతో
విశ్వమంతా ధగ ధగ మెరిసింది
ధరణి అంతా ఎర్రటి కుంకుమంలా విరిసింది
ఆనంద తరంగాలు నింగికెగిసాయి
అందరి చేతులలో ఎర్ర జండాలు రెపరెప లాడాయి
సర్వత్రా శ్రామిక స్వరం హోరెత్తింది
పులకించి – పదండి ముందుకు అని సాగింది
పిడికిలి బిగించి మేఘాలతో గొంతు కలిపింది
సూర్యరశ్మికి స్వేద జలం వెండిలా మెరిసింది
భావితరాలకు విశ్వాసకిరణాలను కురిపించింది
ఈ మేడే రోజున....
జగతిన విజయ నగారా మ్రోగింది.