సాహసబాలుడు
- మాస్టర్ సి. విజయేంద్ర బాబు
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒకసారి ఒక సంఘటన జరిగింది. అది ఏమిటంటే ఒకసారి పక్క ఊరినుండి ఒక స్కూలు పిల్లలు ఆ ఊరికి విహారయాత్రకు వచ్చారు. వాళ్ళు అల్లరి పిల్లలు. వారిలో ఒకడు వాళ్ళ గుంపు నుండి విడిపోయి పక్కకి వచ్చి ఆ ఊరిలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళి ఆడుకుంటుండగా అక్కడికి ఒక పాము వచ్చింది. ఆ పాముని చూడగానే ముందర చెరువు ఉందన్న సంగతి మరచి పరిగెత్తుతూ వెళ్ళి చెరువులో పడిపోయాడు. అక్కడికి దగ్గరలో పశువులు మేపుతున్న ఒక బాలుడు అది చూసి, వాడు మునిగిపోక ముందే బయటకి లాగి కాపాడాడు. తరువాత జరిగిన విషయాన్ని వాళ్ళ టీచర్లతో చెప్పి, వాన్ని వాళ్ళకప్పగించాడు. ఆ పశువుల కాపరి బాలుని సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడటం మంచి అలవాటు.
జరిగిన పొరపాటుకు టీచర్లు బాధపడి, తమ తప్పును కూడా తెలుసుకున్నారు. పిల్లలందరికీ క్రమశిక్షణ నేర్పి వాళ్ళను చక్కగా నడుచుకునేట్టు చేశారు.