అమృతభాష నా మాతృభాష
-
-డా.డాక్టర్ బషీర్, చెన్నపట్టణం
కాదు ఇది ఓ అక్షరాల మూట
పదాల తేట, వాక్యాల చాట
కానే కాదు పుస్తకాల వేట
అలంకారాల దుర్భేద్యపు కోట
కాకూడదు ఆశల, అడియాసల, సయ్యాట
అసూయ నిరాశల కాలిబాట
కావాలి అది అనుభవాల పూదోట
మానవతా పరిమళాలు వెదజల్లాలి అచ్చోట
అవినాభావాల రక్తసంబంధాల ఊట
స్నేహానురాగాల భావాల తేట
యువత భవిత గమ్యానికి బాట
కుమ్మరిస్తున్నవి సిరులన్నియు ఓచోట
ముక్కోటి భావాల హృదయాల ఆట
భావాల, మోహాల, స్నేహాల, బంధాల
పదాలై, వాక్యాలై, గీతికలై, శ్లోకాలై
భాషాభిమానుల, సేవకుల, ప్రేమికుల
విశాల హృదయాలపై కవి పండితుల
జిహ్వలపై నర్తిస్తున్నాయి
అందరి పెదవులపై
మధురానుభూతులను చిలికిస్తున్నాయి
కలకాలం ఇది పండాలి
అందరినోట ముత్యాల మూట
భూదేవి హృద్వీణ పాట
నా మాతృభాష, నా తల్లిభాష
అమ్మపాల కమ్మని భాష
కోటి వీణల సలలిత రాగ సుధారస పాట
లోక కల్యాణానికి ఓ తపస్సు
ఎన్నటికీ తరగని ఉషస్సు
భావావేశాల మేధస్సుల తేజస్సు
నా అమృతభాష నా మాతృభాష
అమరభాష, సమరభాష, సమరసభాష
No comments:
Post a Comment