Wednesday, July 23, 2008

కవిత KAVITA

నాన్న

డా. ఎస్. బషీర్, చెన్నయ్

జీవితాన్ని, అనుభవాన్ని
శ్రమను, మేధను
అహర్నిశలు ధారపోస్తూ
శిలలను, సజీవ శిల్పాలుగా మలిచే
అద్భుత అమర శిల్పి - నాన్న


--

కుటుంబ సౌభాగ్యాన్ని
సంతాన శ్రేయస్సును కాంక్షిస్తూ
నవ తరాన్ని, భావి తరాన్ని
ప్రగతి పథం వైపుకు నడిపించే
మార్గదర్శి, దూరదర్శి నాన్న

--

కుటుంబ చరితలో...
తన వాళ్ళ నిండు మనస్సుల్లో...
మైలురాయిగా, స్థిరంగా
నిలిచిపోయే శిలాక్షరం, కీర్తి స్థంభం నాన్న

--

తనకోసం ఏమీ మిగుల్చుకోక పోయినా
తన సంతానం కోసం ఎన్నటికీ తరగని
విజ్ఞాన ధనం, సిరి సంపదలు,
ప్రసాదించే ధన్యజీవి, అమరజీవి నాన్న

--

ఐనవారి సుఖం కోసం
కొవ్వొత్తిలా వెలుగునిస్తూ
కరిగి పోయే కర్మజీవి నాన్న

--

అంధకారంలో ఉన్నా
తనవాళ్ళకు వెలుగు ప్రసాదించే
టార్చిలైటు-మార్గదర్శి నాన్న

--

తాను కాలిపోయినా
తన వారికి సువాసనలు వెదజల్లే
అగరొత్తి నాన్న

--

తాను కాలే కడుపుతో ఉన్నా
తన వాళ్ళకు పరమాన్నం పంచిపెట్టే
అక్షయ పాత్రధారి నాన్న

--

తన బతుకు అరణ్యరోదనైనా
తనవాళ్ళ బతుకుల్ని సంగీతభరితం చేసే
అద్భుత గాత్రధారి నాన్న

--

1 comment:

युग मानस yugmanas said...

నాన్న సైతం మనిషి మధురమైన మహనీయ వ్యక్తి అనే భావనను చాటే తమరి ఈ కవిత నేటి యువతం,అందరి నాన్నల ముద్దుల సంతానాలు చదివి ముదిమి వయసులో నున్న అమ్మనాన్నలను బాగోగుల గురించి క్షణం తీరికతో నైనా ఆలోచించి, కొంతైనా మేలు చేయటాని ఈ కవిత చైతన్య దీపికగా కీర్తింపబడాలని కాంక్షిస్తున్నాను.
- బాబు