Sunday, October 19, 2008

కవిత kavita


అమ్మాయిలు

- డా. బషీర్, చెన్నై


అమ్మాయిలు
కంటికి రూపాలు
ఇంటికి దీపాలు
ముఖారవిందాలు
దేవుడి వరాలు
కలవారికి ఐశ్వర్యాలు
లేనివారికి ఆత్మస్థైర్యాలు

అమ్మాయిలు
వాడని వసంతాలు
వీడని సుమధుర భావాలు
తరగని అమృతభాండాగారాలు
అమరప్రేమకు నిర్వచనాలు
జన్మ-జన్మల అనుబంధాలు

అమ్మాయిలు
ఆశయాలకు ప్రతిబింబాలు
ఆశలకు ఊపిరులు
అనురాగాలకు ముద్దుమురిపాలు
ఆప్తుల పెదవులపై చిరునవ్వులు
కుటుంభాలకు సజీవ ప్రతిరూపాలు

అమ్మాయిలున్న ఇళ్ళు
స్వర్గానికి నిలయాలు
మమతల కోవెలలు
సుఖశాంతుల లోగిలులు
లక్ష్మీసరస్వతుల సంగమాలు

అమ్మాయిలున్న ఇళ్ళు
కోటి దీపాల వెలుగులు
లక్ష తారకల జిలుగులు
సంగీత సుధారస భరితాలు
జననీ జనకుల జీవనసఫలాలు

అమ్మాయిలున్న ఇళ్ళు
ప్రతిరోజూ పండుగలు
హోళీ దసరా దీపావళీలు

అమ్మాయిలు జాతికి చిహ్నలు
దేశానికి గర్వకారణాలు
చరిత్రకు దర్పణాలు
నాగరికతకు కీర్తిపతాకాలు
దేశాభ్యుదయాని రథసారథులు

అమ్మాయిలే నాటికి నేటికి ఏనాటికి
తరగని కరగని అలుపెరగని అసమాన ధనులు
యోధులు, ధురంధరులు
అభిమానవతులు,
అజరఅమరఅఖిల జగాలలో
చరితార్థులు విద్యావేత్తలు
కారణజన్ములు
ప్రగతికి రథచక్రాలు
ఈ జగతికి సూర్యచంద్రులు

అమ్మాయిలే
సమస్తమానవాళికి
జీవనప్రదాతలు.

1 comment:

S Sadiq said...

girl children are the gift of GOD which are reflected and highlighted in this poetry are appreciable.THE MESSAGE should be given wide publicity which is essential for the developement of WOMENHOOD