హైకూలు
- డా. ఎస్. బషీర్, చెన్నై.
కొన్ని బంధాలు
కాయిన్ బాక్సులు
డబ్బిస్తేనే పలుకు
భీకర యుద్ధం
శవాల గుట్టలు
రాబందుల పండుగ
గడ్డి పరక
భయంతో వణుకుతూ పాపం
హిరోషిమాలో మొలకెత్తు
బంధాలు -పర్వతాలు
దూరం నుండి చూస్తేనే
అందంగా ఉండు
పాషాణ హృద్వి
అబద్ధ పర్వతాన్ని
చీల్చు ఓ చిన్ననిజం
భీకర సునామి
ప్రాచీన యుగసృష్టి
క్షణం లో మాయం
మేఘాల్ని తాకుతూ
పక్షి ఉత్సాహంగా
సాగింది పాపం
చల్లని సెలయేళ్ళు
పచ్చని చేల గట్లు
ఏవీ ఆ గ్రామాలు
గారాల బిడ్డ
అత్తవారింట్లో
గారెలా కాలిందే
జీవితం లో
కఠినమైనది
నెమ్మది తనం