Monday, November 30, 2009

హైకూలు Hykoos



హైకూలు



- డా. ఎస్. బషీర్, చెన్నై.



కొన్ని బంధాలు


కాయిన్ బాక్సులు


డబ్బిస్తేనే పలుకు


భీకర యుద్ధం
శవాల గుట్టలు
రాబందుల పండుగ

గడ్డి పరక
భయంతో వణుకుతూ పాపం
హిరోషిమాలో మొలకెత్తు

బంధాలు -పర్వతాలు
దూరం నుండి చూస్తేనే
అందంగా ఉండు

పాషాణ హృద్వి
అబద్ధ పర్వతాన్ని
చీల్చు ఓ చిన్ననిజం

భీకర సునామి
ప్రాచీన యుగసృష్టి
క్షణం లో మాయం

మేఘాల్ని తాకుతూ
పక్షి ఉత్సాహంగా
సాగింది పాపం

చల్లని సెలయేళ్ళు
పచ్చని చేల గట్లు
ఏవీ ఆ గ్రామాలు


గారాల బిడ్డ
అత్తవారింట్లో
గారెలా కాలిందే


జీవితం లో
కఠినమైనది
నెమ్మది తనం

1 comment:

రమణ / Ramana said...

డా. బషీర్ గారి ఈమెయిల్ మీ వద్ద వుంటే పంపగలరా? ramanah@gmail? Thanks. వారు నాకు మద్రాసులో పరిచయం. ఒక సారి పలకరిద్దామని.