Monday, January 25, 2010

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు



60వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Saturday, January 23, 2010

సుభాష్! నీకు జోహార్లు!!

నేతాజీకి కవితాంజలి

సుభాష్! నీకు జోహార్లు!!

- డా. బషీర్, చెన్నపట్టణం.
మాతృభూమి దాస్యశృంఖలాలను ఛేదించి
ఆంగ్లేయుల పాలనను ఎదిరించి
స్వాతంత్రోద్యమ విజయశంఖాన్ని పూరించి
గాంధీ అహింసా సిద్ధాంతాలను విభేదించి
అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన
ఓధీశాలీ సుభాష్ చంద్రబోస్!
నీకు వందనం! శతకోటి అభినందన చందనం!!
నీ పోరాట జ్ఞాపకాలు నవచైతన్య కాగడాలు
నీ ధైర్యసాహసాలు ఎవరెస్టు శిఖరాలు
నీ త్యాగఫలం హిందూ మహా సాగరాలు
బ్రిటిష్ కుంభస్థలాన్ని భేదించిన ఓ యువకిశోరా!
నీ స్వాతంత్ర్యకాంక్ష చరిత్రలో అజరఅమరం
‘ఆజాద్ హింద్ ఫౌజ్’ స్థాపించి
యుద్ధాన్ని ప్రకటించి
“మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను దేశానికి విముక్తి ప్రసాదిస్తాను” – అని నొక్కిపలికి
ప్రపంచానికి ఎలగెత్తి చాటిన అమరవీరుడివి నీవు
నీకు జననమే కానీ మరణము లేదు
అందుకే నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావని
మళ్ళీ ప్రత్యక్షమై ఈ దేశంలో కూరుకున్న
అవినీతిని తరిమివేస్తావని
ఇంకామాలో విశ్వాసం ప్రబలి ఉన్నది
ఓదేశ ప్రేమికుడా నీకు జోహార్లు !!

నేడు సుభాష్ చంద్ర బోస్ జయంతి (23 జనవరి)

కవిత

సుభాష్ చంద్ర బోస్ అమర్ రహే


-శ్రీమతి ములుగు లక్ష్మి మైథిలి, నెల్లూరు.

భరత మాత ప్రియసుతుడు
ఆ తల్లి దాస్య విముక్తి కై పోరాడినహితుడు
బ్రిటష్ వారిని ఎదిరించిన స్వరాజ్యప్రదాత
నేటి యువతకు కావాలి ఆ చేయూత
ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి
నేటి యువతకు స్ఫూర్తి
నేతాజీ సందేశం సజీవం
ధీరుడు, శూరుడు, అమరుడు
సాయుధ సంగ్రామoలో గగనంలో కలిసిన
సుభాష్ చంద్ర బోస్ అమర్ రహే

***




ఒంగోలు లో జనవరి 8,9 మరియు 10 తేదీన జరిగిన 6వ రాష్ట్రస్థాయి రచయితల మహాసభలో బి. హనుమారెడ్డి (అద్యక్షులు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం ) చేతులమీదుగా కవితాపురస్కారాన్ని అందుకుంటున్న శ్రీమతి ములుగు లక్ష్మీ మైథిలిగారు.

Friday, January 1, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలతో...



ఆత్మీయానుబంధాలకు స్వాగతం! సుస్వాగతం!!



- డా. బషీర్, చెన్నపట్టణం.


కొత్త ఆశయాలకు కొత్త భావాలకు
పరికల్పనలు బంగారు కలలకు
కొన్ని సత్యాలకు, స్నేహ బంధాలకు
త్యాగాలకు రాగాలకు
ఆత్మీయానుబంధాలకు స్వాగతం! సుస్వాగతం!!
2010 నీకు ఘన స్వాగతం
పరిగెడుతున్న కాలం పురివిప్పింది నెమలిలా
వేయి వీణలను మీటి నవ వసంత, సలలిత రాగసుధా గానాన్ని
వినిపించి వీనుల విందు చేసింది
నవ జ్యోతులను వెలిగించింది
ప్రతి అణువు పులకించింది
ప్రతి గుండె ఆనందంతో పరవశించింది
జగతిన క్రొత్త సంవత్సరం మెరిసింది
విశ్వవేధికపై మధువసంతం మురిసింది
జీవితాలకు క్రొత్త ఊపిరి పోసింది
2010లోనైనా మానవతకు విలువ ఉంటుందని ఆశిద్దాం
జాతి, మత, భాషా ప్రాంతీయ భేదాలు విడనాడి
విశ్వశాంతికై ఐక్యతాగీతాన్ని పాడుకుందాం.