Tuesday, August 28, 2012

ఉత్తమ ఉపాధ్యాయుల కుండవలసిన లక్షణాలు...


ఆర్యులారా! నమస్సులు.
వచ్చే నెల ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవము జరుగబోతోంది కదండీ! అందుకని మంచి ఉపాధ్యాయులను గౌరవించటం ద్వారా గురువుల యెడ మనకు కలిగిన గౌరవ భావాన్ని చాటటం మన కనీస కర్తవ్యంగా భావిస్తున్నాను. అంతే కాదు. 
ఎందరో సహృదయులైన ఉపాధ్యాయులు తాము ఉత్తమ ఉపాధ్యాయులుగా మెలగుట కొఱకు సహృదయులు సూచించే మార్గదర్శకాలను అనుసరించుట కొఱకు ఎదురు చూస్తున్నారు. సహృదయులైన మీరు ఉత్తమ ఉపాధ్యాయుల కుండవలసిన లక్షణాలుగా భావించే అంశాలను వ్యాసాల రూపంలో సూచిస్తే అవి మన "ఆంధ్రామృతం" బ్లాగులో ప్రచురింపబడటం ద్వారా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచ గలనని మనవి చేస్తున్నాను. 
అంతే కాదు. మీ హృదయాన్ని తమ అసాధారణ సత్ప్రవర్తనతో దోచుకున్న ఉత్తమ ఉపాధ్యాయులెవరైనా ఉన్నట్లైతే తప్పక వారి ఛాయా చిత్రంతో పాటు వారి విజయ పరంపరను కూడా వివరంగా పంప వలసినదిగా కోరుచున్నాను.
అవకాశం ఉంటే ఈ క్రింది యూఆరెల్ తెరచి చదవండి.
ఇట్లు 
బుధజన విధేయుఁడు,
చింతా రామ కృష్ణా రావు.


Friday, July 13, 2012

డా. బషీర్ గారి చిరు కవిత

కవిత

భక్తి ద్వారా అనురక్తి
- డా. బషీర్  చెన్నై

భక్తి ద్వారా అనురక్తి
అనురక్తి ద్వారా శాంతి

శాంతి ద్వారా జ్ణానకాంతి

కాంతి ద్వారా ముక్తి

మానవ ప్రగతి కి తార్కాణం

ఇహ పర లోక సోపానం

ప్రేమాను రాగాలు

బంధాలు అనుబంధాల ద్వారా

నిత్య కళ్యాణం పచ్చ తోరణం

జీవనప్రగతి కిమార్గం

వాసుదైవ కుటుంబానికి  నిదర్శనం

త్యాగం సత్కార్యం

పేరుప్రతిష్ఠలకు ప్రతీక! పతాక!             

అంతరంగం

తేనెలొలుకు తెలుగు భాష కు అక్షరాంజలి గా నిరంతర సాహితీ యజ్ఞంగా ఆరంభమైన సాహితి 101 రచనల ప్రచురణ తరువాత నేటి వరకు దాదాపు ఒక ఏడాది పాటు అనివార్యకారణాల వలన నిత్యనూతన సామగ్రిని అందివ్వ కుండా నిష్క్రియ గా ఉండి పోవటం కారణంగా ఆత్మీయ పాఠక వర్గానికి, రచయితలకు కలిగిన అసౌకర్యానికి  సాహితి  సంచాలకులు చింతిస్తూ అందరినీ క్షమించమని ప్రార్ధిస్తూ...  ఇక నుండి నిరంతరం  సాహితి  తమ మనోవికాసానికి, వినోదానికీ హరివిల్లు కాగాలదని... అందరి ఆత్మీయతను ఎప్పటిలాగే కాంక్షిస్తూ....
మీ

సి. జయ శంకర బాబు