నేటి ఆంధ్రజ్యోతి (అనంతపురం జిల్లా ఎడిషన్) లో విజయసోపానం శీర్షికన ప్రచురితమైన స్టోరీ మొదటి వాక్యంలోనే పెద్ద పొరపాటు
నేటి ఆంధ్రజ్యోతి (అనంతపురం జిల్లా ఎడిషన్) లో విజయసోపానం శీర్షికన ప్రచురితమైన స్టోరీ మొదటి వాక్యంలోనే
పెద్ద పొరపాటుండి పోయింది. నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాననటం పెద్ద పొరపాటు.
నేను ఐ.టీ.ఐ. లో చేరటానికి దారితీసిన పరిస్థితులు వేరు. నేను చదివిన
రోజుల్లో గణితంలో శతాంకం సాధించికూడా ఆ సంవత్సరం కెమిస్ట్రీలో ఎందరో ఫెయిల్ కాగా
నేను మాత్రం అన్ని సబ్జెక్ట్ లో తగినన్ని మార్కులతో ఇంటర్ పాసయ్యాను. ఇంటర్ ద్వితీయ
శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ నేను ఆశించినట్లు ప్రభుత్వ కళాశాలలో
బి.ఎస్.సీ. సీటు లభించకపోవటం వలన ఐ.టీ.ఐ. లో కంప్యూటర్ కోర్సు చేరదలచి అప్లై
చేస్తే అదీ లభించక డీసెల్ మెకానిక్ కోర్సు ప్రథమ శ్రేణి లో ఉత్తీర్ణత
సాధించాక మళ్ళీ ప్రయత్నించినా నేను ఆశించినట్లు ప్రభుత్వ కళాశాలలో బి.ఎస్.సీ. సీటు లభించకపోవటం వలన
(ప్రైవేటు కళాశాల లో సీటు లభించినా ఆర్థిక కారణాల వల్ల (ఎక్కువ ఫీసు చెల్లించలేని స్థితి కారణంగా) ప్రభుత్వ కళాశాలలోనే బీ.కాం. లో చేరి మొదటి సంవత్సరంలో
ప్రథమ శ్రేణి సాధించినప్పటికీ ద్వితీయ సంవత్సరంలో ఆర్.టీ.సీ. లో అప్రెంటిస్ గా
అవకాశం లభించటంతో అటువైపు పెద్దల మక్కువ వలన మెకానిక్ - అప్రెంటిస్ గా
చేరినప్పటికీ తదుపరి ఏ.పీ.ఎస్. ఆర్.టీ.సీ. లో రెగ్యులర్ ఉద్యోగం లభించినా చేరకుండా
హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగ భాద్యతలు నిర్వహించి అదే
దిశలో పై స్థాయిలో అధ్యాపక ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం దిశగా ఒక వైపు డిస్టెన్స్ ద్వారా
చదువులు కొనసాగిస్తూనే పోటీ పరీక్షల రాయడం ద్వారా లభించిన అవకాశాల్ని
చేజారనివ్వకుండా ఆశించినట్లుగా విశ్వవిద్యాలయ స్థాయిలో అధ్యాపక సేవలందిచాలన్న
అభిరుచి దిశగా పట్టుదలతో కృషిచేయటంతో సాధించగలిగాను.
ఇంటర్ ఫేలయి సప్లిమెంటరీ పరీక్షలో పాసయి ఉంటే యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యే
అవకాశమే ఉండదు. ఈ విషయం కూడా పాఠకులకు (ముఖ్యంగా ఉన్నత విద్యా, ఉద్యోగ
అవకాశాలు చేజిక్కించుకోవాని ఆశించే విద్యార్ధులకు) తెలపటం అవసరం. అప్పుడే
సరియైన దిశలో వాళ్లు ప్రయత్నించగలరు. నాకు పోటీ
పరీక్షల రాయడం ద్వారా మరెన్నో ఉద్యోగాలు లభించినప్పటికీ నా ప్రవృత్తికి తగిన
ఉద్యోగమే చేయాలన్న లక్ష్యం దిశగా వాటిని స్వీకరించలేదు. అటువంటి వాటిలో ఇటీవల వచ్చిన ఒక
పెద్ద అవకాశాన్ని కూడా కాదను కున్నాను, అది ప్రభుత్వరంగ బ్యాంకులో జనరల్ మేనేజర్
ఉద్యోగం. ఈ నిజాలు పాఠకులకు ప్రేరణాదాయకంగా ఉండగలవనిపిస్తే ఆంధ్రజ్యోతి లో
రిజాయిండర్ ను ప్రచురించడం శ్రేయస్కరంగా భావిస్తున్నాను. ఇవన్ని విషయాలూ కాక
పోయినా నేను ఇంటర్ ఫెలయ్యానన్న విషయం ప్రచురించటం అవసరం. (ముఖ్యంగా
ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకోవాని ఆశించే
విద్యార్ధులకు) తెలవాల్సిన అవసరం ఉంది. Consistent Educational Back Ground
ఉండటం అవసరమనే విషయం వారికి తెలిస్తే విజయసోపానం దిశగా పయనించగలరు. ఆంధ్రజ్యోతి లో
విజయసోపానం శీర్షిక ఉద్దేశం కూడా అదే అనుకుంటాను.
Courtesy:- Andhra Jyothy E-Paper
No comments:
Post a Comment