చిట్టితల్లి
- డా. ఎస్. బషీర్, చెన్నై
చిట్టితల్లీ నీ బంగారు ముద్దుల పలుకులు
వేసవితాపాన పన్నీటిజల్లులు
కోటి చిరుదివ్యకాంతి పుంజాలు
నీరుచరిత మందహాసాలు
నీవునడయాడే మా లోగిల్లు
ముక్కోటి దేవతలకు నిలయాలు
నీ దివ్యనయన కటాక్షాలు
మలయసమీరాలు ఋతుపవనాలు
ముఖారవింద అందచందాలు
ఇంద్రలోకంనుండి కురిసిన వెన్నెల పారిజాతాలు
అక్షరలక్షలున్న ఎన్నడూ తరగని కరగని సిరులు
భవబంధాల అనుబంధాలకు తార్కాణాలు
నైరాశ్య జీవనాన ఆశలవర ప్రసాదాలు
నిశీథ హృదయఆకాశాన కోటితారక స్ఫటికాలు
పరితపించే శూన్య భవిష్యాన ప్రేరణ దీపికలు
జడత్వానికి చైతన్యం ప్రసాదించే శుభమంత్రాలు
వైష్ణవీదేవి నీ కరుణ కటాక్షాలు
ప్రతి ఇంటి ముంగిట కురవాలి అష్టైశ్వర్యాలు.