తెలివైన శిల్పి
- మాస్టర్ సి. విజయేంద్ర బాబు, 5వ తరగతి
ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు వాడు. తనలాంటి శిల్పాలను ఎన్నో చెక్కాడు. చాలా సంవత్సరాల తరువాత అతడికి ఒక ఆలోచన వచ్చింది. తనలాంటి మాట్లాడేశిల్పాన్ని తయారు చేసాడు . కొన్ని సంవత్సరాల తరువాత, మృత్యువు తనను వెంటాడసాగింది. శిల్పి తనను తాను కాపాడుకోవటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తను చెక్కిన శిల్పాల మధ్య నిలుచుకున్నాడు. అప్పుడు అతనిని పట్టుకోడానికి మృత్యుదేవత ఒక ఉపాయము ఆలోచించి, “ఆహా! ఎవరీ శిల్పి” అంది. శిల్పి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పుడు తను చెక్కిన ఆ మాట్లాడే శిల్పం నేనే ఆశిల్పిని అంది. అప్పుడు మృత్యువు ఆ శిల్పాన్ని తన వెంట తీసుకొని వెళ్ళింది. శిల్పి ఎన్నో రోజులు ఆనందంగా జీవించాడు.
2 comments:
little master vijay telivaina silpi dwaara chakkani telivyna sandesamicchaavu baagu baagu
మాస్టర్ సి. విజయేంద్ర బాబు
నీవు వ్రాసిన చిన్ని కవిత, ఆ తెలివైన శిల్పి సమయస్పూర్తి మరియు అతని తెలివి తేటలను తెలియ చెప్తున్నాయి. నీ కవిత చాలా బావుంది.
Post a Comment