Showing posts with label బాల సాహితి BALA SAHITI. Show all posts
Showing posts with label బాల సాహితి BALA SAHITI. Show all posts

Sunday, March 7, 2010

బాల సాహితి

చిన్న కథ

పశ్చాత్తాపం

ఒక ఊరిలో ఒకతను ఉండేవాడు. అతని పేరు ధనగుప్తుడు. అతనికి పిసినారితనం ఎక్కువ. నెలకు ఒక షాంపూ ప్యాకెట్ వాడుకునేవాడు. రోజుకు ఒక మెతుకు బియ్యం తినేవాడు. అందుకే అతడు బలహీనంగా తయారయ్యాడు. ఎవరినీ నమ్మకపోవడంతో ఉన్న ధనమంతా ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఒక రోజు అతని ఇంట్లో దొంగలు పడ్డారు . బలహీనంగా ఉండటంతో అతను ఏమీ చేయలేకపోయాడు. తినడానికి లేక అడుక్కు తినసాగాడు. డబ్బున్నపుడే బ్యాంకులో దాచుకొని ఉంటే తనకీ కష్టం వచ్చిఉండేది కాదని పశ్చాత్తాపం పడ్డాడు. కష్టం వచ్చాక పశ్చాత్తాప పడి ఏం లాభం?

Friday, May 22, 2009

బాల సాహితి BALA SAHITI


కవిత

ఉయ్యాల


- సి. విజయేంద్ర బాబు, 4వ తరగతి


పార్కులో ఉయ్యాల ఊగుతున్నప్పుడు


గాలిలో తేలుతున్నట్టు


నింగిలో ఎగురుతున్నట్టు


విమానాలను పట్టుకున్నట్టు


పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు


ఎన్నెన్నో అనుభవాలు...


అలా చూస్తూ ఉంటే పచ్చని చెట్లు


దూరాన ఉన్న కొండలు అన్నీ


నా కళ్ళముందే ఉన్నట్టనిపిస్తుంది


పచ్చని చెట్లపై కిలకిలరవాలు చేస్తున్న పక్షుల్లా


మనసంతా ఆనందమయమే.



Saturday, August 23, 2008

బాల సాహితి BALA SAHITI



శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు...


Janmastami Greetings...


ఉప్పలధడియం అన్నపూర్ణ



చిన్నారి చిత్రకారిణి ఉప్పలధడియం అన్నపూర్ణ కలం నుండి జాలువారిన వర్ణచిత్రం

Friday, August 1, 2008

బాల సాహితి



అంజలి

- ఉప్పలధడియం రవితేజ

ఆ.వె. అమరజీవి వలన ఆంధ్ర రాష్ట్రము వచ్చె
దీని మరువరాదు తెలుగువారు
ఎక్కడున్నగాని ఎల్లప్పుడతనిని
తలచుకొనుట మనకు ధర్మమగును.

ముత్యాల సరములు

- ఉప్పలధడియం రవితేజ

పల్లెలోనూ పట్నమందూ
తేజుగాడూ అన్నపూర్ణా
ఒంటెమీదా ఓడలోనూ
తేజుగాడూ అన్నపూర్ణా
అప్పడాలూ, ఆవకాయా
ఎర్రగడ్డా, గనుసుగడ్డా
కందగడ్డా, ఉర్లగడ్డా
నాకుమాత్రం పట్టదోయ్.