Sunday, February 7, 2010

కవిత

విస్తరణ


- ఉప్పలధడియం వెంకటేశ్వర


చిన్నప్పుడు
రోజూ సాయంత్రం
బజరుకెళ్ళే వాళ్ళం
ఇప్పుడు
అనునిత్యం
బజారే మా ఇంట్లో !

Friday, February 5, 2010

తెలుగు తేజస్సును విశ్వవ్యాప్తం చేద్దాం

తమ రచనలకు ఆహ్వానం

తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగువారి తేజోదీప్తిని మనం ఏనోట విన్నా మన భాష పట్ల, మన వారిపట్ల మనకు గర్వంతో కూడిన అపారగౌరవానుభం కావటం సహజం. మన భాషగొప్పదనం గురించి మనం తెలుసుకోవసిందే ఎంతో ఉంది. మరి మన భాష గురించి, మన తెలుగు తేజాలనిపించుకోదగిన మనవారి గురించి ఇతర భాషీయులకు తెలిసేదెన్నడు ? ఈ ప్రశ్న సమాధానంగా సాహితి తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడం లో ఇదివరకే నిమగ్నమై ఉంది, ఇకపై మరింత చైతన్యంతో ముందడుగు వేయటానికి అందరి సహకారాన్ని కోరుతోంది. తెలుగు భాష గొప్పదనం గురించి, వివిధ రంగాలకు తెలుగు భాషీయుల చేయూత గురించి మొదట తెలుగు, తర్వాత మీకు తెలిసిన మరే భాషలోనైనా సరే అదే విషయం పై యూనికోడ్ తెలుగు లో టైపుచేసి సాహితికి (E-mail:- yugmanas@gmail.com & saahitee@gmail.com పంపగలరు.

Thursday, February 4, 2010

కవిత



(తేది 26-01-2010 న ఇండియన్ తెలుగు అసోషియేషన్ ద్వారా “తెలుగు తేజం” అవార్డు గ్రహీత “డాక్టర్ గజల్ శ్రీనివాస్” సన్మాన సభలో శాలువాతో సన్మానిస్తున్న డాక్టర్ యస్. బషీర్, శ్రీ యస్సీ వై నాయుడు మరియు శ్రీ రాజ శేఖర్)

తెలుగు తేజం గజల్ శ్రీనివాస్
- Dr. S. BASHEER, Chennai

తెలుగు వాళ్ళకు, తెలుగు గజల్స్ రంగు, రుచి, వాసన చూపించి,
తెలుగు గజల్స్ కు విశ్వ విఖ్యాతి కల్పించిన,
నిలువెత్తు సంతకం ఈ గజల్ శ్రీనివాస్.
గాంధీజీ సందేశాల్ని, 125 భాషల్లో పాడి, వినిపించి,
గాంధీజీ గోల్డెన్ డ్రీమ్స్ ఆల్బం విడుదల చేసి,
మహా శాంతి యాత్రలో ... సత్యం, శాంతి, ప్రేమ, సత్యాగ్రహాల
ఫిలాసఫీని దశ దిశల చాటుతున్న “మ్యాస్ట్రో గజల్ శ్రీనివాస్” కు
“తెలుగు తేజం” అవార్డు ఇచ్చిన శుభ సందర్భాన
మాహార్దిక శుభాభి వందనాలు
కోటి అభినందన చందనాలు.

Saturday, January 23, 2010

సుభాష్! నీకు జోహార్లు!!

నేతాజీకి కవితాంజలి

సుభాష్! నీకు జోహార్లు!!

- డా. బషీర్, చెన్నపట్టణం.
మాతృభూమి దాస్యశృంఖలాలను ఛేదించి
ఆంగ్లేయుల పాలనను ఎదిరించి
స్వాతంత్రోద్యమ విజయశంఖాన్ని పూరించి
గాంధీ అహింసా సిద్ధాంతాలను విభేదించి
అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన
ఓధీశాలీ సుభాష్ చంద్రబోస్!
నీకు వందనం! శతకోటి అభినందన చందనం!!
నీ పోరాట జ్ఞాపకాలు నవచైతన్య కాగడాలు
నీ ధైర్యసాహసాలు ఎవరెస్టు శిఖరాలు
నీ త్యాగఫలం హిందూ మహా సాగరాలు
బ్రిటిష్ కుంభస్థలాన్ని భేదించిన ఓ యువకిశోరా!
నీ స్వాతంత్ర్యకాంక్ష చరిత్రలో అజరఅమరం
‘ఆజాద్ హింద్ ఫౌజ్’ స్థాపించి
యుద్ధాన్ని ప్రకటించి
“మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను దేశానికి విముక్తి ప్రసాదిస్తాను” – అని నొక్కిపలికి
ప్రపంచానికి ఎలగెత్తి చాటిన అమరవీరుడివి నీవు
నీకు జననమే కానీ మరణము లేదు
అందుకే నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావని
మళ్ళీ ప్రత్యక్షమై ఈ దేశంలో కూరుకున్న
అవినీతిని తరిమివేస్తావని
ఇంకామాలో విశ్వాసం ప్రబలి ఉన్నది
ఓదేశ ప్రేమికుడా నీకు జోహార్లు !!

నేడు సుభాష్ చంద్ర బోస్ జయంతి (23 జనవరి)

కవిత

సుభాష్ చంద్ర బోస్ అమర్ రహే


-శ్రీమతి ములుగు లక్ష్మి మైథిలి, నెల్లూరు.

భరత మాత ప్రియసుతుడు
ఆ తల్లి దాస్య విముక్తి కై పోరాడినహితుడు
బ్రిటష్ వారిని ఎదిరించిన స్వరాజ్యప్రదాత
నేటి యువతకు కావాలి ఆ చేయూత
ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి
నేటి యువతకు స్ఫూర్తి
నేతాజీ సందేశం సజీవం
ధీరుడు, శూరుడు, అమరుడు
సాయుధ సంగ్రామoలో గగనంలో కలిసిన
సుభాష్ చంద్ర బోస్ అమర్ రహే

***




ఒంగోలు లో జనవరి 8,9 మరియు 10 తేదీన జరిగిన 6వ రాష్ట్రస్థాయి రచయితల మహాసభలో బి. హనుమారెడ్డి (అద్యక్షులు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం ) చేతులమీదుగా కవితాపురస్కారాన్ని అందుకుంటున్న శ్రీమతి ములుగు లక్ష్మీ మైథిలిగారు.

Friday, January 1, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలతో...



ఆత్మీయానుబంధాలకు స్వాగతం! సుస్వాగతం!!



- డా. బషీర్, చెన్నపట్టణం.


కొత్త ఆశయాలకు కొత్త భావాలకు
పరికల్పనలు బంగారు కలలకు
కొన్ని సత్యాలకు, స్నేహ బంధాలకు
త్యాగాలకు రాగాలకు
ఆత్మీయానుబంధాలకు స్వాగతం! సుస్వాగతం!!
2010 నీకు ఘన స్వాగతం
పరిగెడుతున్న కాలం పురివిప్పింది నెమలిలా
వేయి వీణలను మీటి నవ వసంత, సలలిత రాగసుధా గానాన్ని
వినిపించి వీనుల విందు చేసింది
నవ జ్యోతులను వెలిగించింది
ప్రతి అణువు పులకించింది
ప్రతి గుండె ఆనందంతో పరవశించింది
జగతిన క్రొత్త సంవత్సరం మెరిసింది
విశ్వవేధికపై మధువసంతం మురిసింది
జీవితాలకు క్రొత్త ఊపిరి పోసింది
2010లోనైనా మానవతకు విలువ ఉంటుందని ఆశిద్దాం
జాతి, మత, భాషా ప్రాంతీయ భేదాలు విడనాడి
విశ్వశాంతికై ఐక్యతాగీతాన్ని పాడుకుందాం.