Showing posts with label కవిత kavita. Show all posts
Showing posts with label కవిత kavita. Show all posts

Saturday, June 18, 2011

కవిత - అమృతభాష నా మాతృభాష


అమృతభాష నా మాతృభాష
-
-డా.డాక్టర్ బషీర్, చెన్నపట్టణం

కాదు ఇది ఓ అక్షరాల మూట
పదాల తేట, వాక్యాల చాట
కానే కాదు పుస్తకాల వేట
అలంకారాల దుర్భేద్యపు కోట
కాకూడదు ఆశల, అడియాసల, సయ్యాట
అసూయ నిరాశల కాలిబాట
కావాలి అది అనుభవాల పూదోట
మానవతా పరిమళాలు వెదజల్లాలి అచ్చోట
అవినాభావాల రక్తసంబంధాల ఊట
స్నేహానురాగాల భావాల తేట
యువత భవిత గమ్యానికి బాట
కుమ్మరిస్తున్నవి సిరులన్నియు ఓచోట
ముక్కోటి భావాల హృదయాల ఆట
భావాల, మోహాల, స్నేహాల, బంధాల
పదాలై, వాక్యాలై, గీతికలై, శ్లోకాలై
భాషాభిమానుల, సేవకుల, ప్రేమికుల
విశాల హృదయాలపై కవి పండితుల
జిహ్వలపై నర్తిస్తున్నాయి
అందరి పెదవులపై
మధురానుభూతులను చిలికిస్తున్నాయి
కలకాలం ఇది పండాలి
అందరినోట ముత్యాల మూట
భూదేవి హృద్వీణ పాట
నా మాతృభాష, నా తల్లిభాష
అమ్మపాల కమ్మని భాష
కోటి వీణల సలలిత రాగ సుధారస పాట
లోక కల్యాణానికి ఓ తపస్సు
ఎన్నటికీ తరగని ఉషస్సు
భావావేశాల మేధస్సుల తేజస్సు
నా అమృతభాష నా మాతృభాష
అమరభాష, సమరభాష, సమరసభాష

Thursday, April 28, 2011

ఆంగ్ల కవిత (A poem in English)

CHANGE



- Rangarajan Kazhiyur Mannar, Chennai.


Change is just a way of life
Change may pose a life of strife
Change, if we, the way we look
Change, for sure, broadens the outlook!

Change is the propeller for new idea
Lack of it just leads to same old phobia
Change is life’s smartness to unfold
Myths and mysteries thus far held blindfold!

Change is true of Lord Vishnu’s varied attire
But for it we would just have one picture
Change is true of His multiple avatars
Required to save the earth from usurpers!

Change is a precursor of growth!
Change in the way of thinking brought forth
Theory of Bang how big it was to restore our earth
Change made us take a leap out of earth!

Change, it’s just one thing that doesn’t change
Change just changes the way we take upon challenge
Change, but for you, we would be looking for same old theme!
Change, thanks to you, we now have the world in our home!

Sunday, August 8, 2010

ప్రణవి గేయాలు . [ లాలి పాట ]

మిల మిల మెరిసే నక్షత్రం.....
ఆకాశంలో విచిత్రం.....
చంద్రుని కన్నా పైపైన....
కాంతులు చిమ్మే ఇంపైన ....// మిల //

****

Tuesday, March 16, 2010

బంగారు కలలకు పునాది - ఈ ఉగాది



- డా. ఎస్. బషీర్, చెన్నై / DR.S.BASHEER,CHENNAI


విరోధినామ సంవత్సరానికి వీడ్కోలు !
వికృతి నామ సంవత్సరానికి స్వాగతాలు!!
చైత్ర శుద్ధ పాడ్యమిన ఉగాది శుభారంభాలు
తెలుగు వారికి చంద్రమానం,
తమిళులకు సౌరమానం ప్రకారం శ్రీకారాలు !

తెలుగు వాళ్లకు -ఉగాది
కన్నడిగులకు -యుగాది
తమిళ్ళులకు- పుత్తాండు
మలయాళీలకు- విషు
మరాఠీయులకు-గుడీపడ్వా
పంజాబీలకు -బైసాఖి
బెంగాలీలకు -పొయలా-బైసాఖి
వేడుకలు వేరైనా, పండుగ ఒకటే !
కొంగొత్త ఆశలకు, విన్నూత్న ఆశయాలకు
కొత్తదనానికి శుభదినం
కొత్త సంవత్సరానికి ఆహ్వానం !
మంచి-చెడు, సుఖదుఃఖాల
చిరునవ్వు -కన్నీళ్ళ, ఆనంద-విషాదాల
కాల చక్ర పరిభ్రమణంలో అన్నిఆకులే !
బతుకు తెరపై మూడు కాలాలు
ఆరు ఋతువులుగా ఓ సంవత్సరం
మెరుపులా సాగుతున్న జీవనయానం
అన్నింటా నిర్నిరోధమే!

వసంతాల నవయవనసోయగాలు
మత్తకోకిలల కుహుకుహురవాలు
మధురిమ తెలుగుపలుకుల తియ్యదనాలు
ప్రతిఎదలోగుస గుసలాడుతున్నాయి
తెలుగు లోగిళ్ల పచ్చతోరణాలు
స్వాగతం పలుకుతున్నాయి
ఈ ఉగాది .......
ఉదాత్త మనోభావాలకు
మహత్తర ఆశయాలకు కావాలి ఆది !
విష సర్పాలకు, విషాదాలకు చెయ్యాలి సమాధి !
సనాతన ధర్మ సాంప్రదాయాలకు ఈ దేశం అనాది !
అందరిబంగారు కలలకు రావాలి సన్నిధి !
మానవ జీవనానికి దొరకాలి సుఖశాంతుల పెన్నిధి !
నేడు మహిళాలోక సంపూర్ణ సాధికారసౌధానికి నాంది !


భావితరాలకు వేయాలి గట్టి పునాది ఈ ఉగాది.

Sunday, March 14, 2010

కవిత


నమస్తే....నమస్తే

- ఏ. రాధిక

ఊహలలో తేలియాడినంతసేపుఅదొక

ఆనందలోకం

కల తేరి ఇలపై కాలిడితే

అది మనకు అసలు సిసలు

ప్రయోగక్షేత్రం

అందులో గెలుపోటములు సమ ఉజ్జీలు

గెలుపును కౌగిలించుకొని

ఓటమికి వెన్ను చూపని వారికి

నమస్తే....నమస్తే

Sunday, March 7, 2010

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో....

కవిత

మహిళ

ములుగు .లక్ష్మి మైథిలి , నెల్లూరు.


అవని నుంచి అంతరిక్షం దాకా


అమ్మ నుంచి ఆదిశక్తి కాగా


విద్యనుంచి వైజ్ఞానికరంగం దాకా


అన్ని రంగాలలో ఆమె తెగువ


నీకు నీవే సాటి ఓ మగువా


మహిళా లోకానికి మంగళ హారతులు


తరుణీ మణులకు మల్లెల మాలలు

Saturday, March 6, 2010

కవిత

Photo: SCY Naidu

వాతావరణ కాలుష్యం


-యస్సీ వై నాయుడు, చెన్నై-SCY Naidu, Chennai



మండుటెండలో, ఎండిన కొమ్మలపై,
మాడే కడుపులతో, పండిన గింజల కోసం,
"కాకా" అంటూ కలయచూస్తున్న కాకమ్మలు....

వచ్చేది వసంత ఋతువైనా......
చిగుళ్ళకు నోచుకోని కొమ్మలు,
నలువైపులా చీకటి ముసురుకున్న మేఘాలు,
దట్టంగా వ్యాపించిన పొగలు,
ఎటు చూచినా ప్రకృతి వినాశకాలు,
ఇవన్నీ ఈవాతావరణ కాలుష్యానికి కారణాలు కావా???

ఇకనైనా మనం ఆలోచించాలి దీనికి "నివారణలు",
లేకుంటే జీవజాతి ఎదుర్కోవాలి ఎన్నో దుష్పరిణామాలు.
అందుకే వృక్షజాలను రక్షించండి !
పచ్చదనాన్ని సృష్టించండి!!


%%%%%%%%%

Monday, March 1, 2010

హోలీ శుభాకాంక్షలతో.....


కలకాలం తీపి జ్ఞాపకాలను మదిలో నింపుకుందాం


- డా. బషీర్, చెన్నై Dr. Basheer, Chennai

రసిక హృదయాల సంగీత జావళి
మతసామరస్యానికి రంగుల నివాళి
భావోద్వేగాల నిండుగా వెలిగే దీపావళి
రంగు రంగుల ఆనందాల పండుగ హోలీ

ఇంద్రధనస్సు భువిపై విరిజల్లు
అందాల ఆనందాల రంగుల చిరుజల్లు
సప్తవర్ణాల హోలీ హరివిల్లు
ప్రతిమదిలో భావానురాగాలు వెదజల్లు

పేద-ధనిక ,చిన్న-పెద్ద తేడాలేకుండా
రాగద్వేషాలకు అతీతంగా
సమసమాజానికి ప్రతీకగా
ఆత్మీయానురాగాలను పంచే ఈ పండుగ

బాధలను, బాధ్యతలను
కనీసం ఒక రోజైనా మరచి
ఆనందోత్సాహాల ద్వారా మురిసి
రంగులతో కొత్త హంగులతో మురిసి

అందరం కలిసి ఆనందంగా హోలీ జరుపుకుందాం
కలకాలం తీపి జ్ఞాపకాలను మదిలో నింపుకుందాం

Thursday, February 25, 2010

కవిత - కష్ట జీవుల సమిష్ఠి కృషి



కష్ట జీవుల సమిష్ఠి కృషి


- ఎస్.సి.వై. నాయుడు, చెన్నై


--SCY Naidu, Chennai--



కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు………………..
ఈ శ్రమ జీవులు ఇలా శ్రమించి,
సముద్రంలో వేట సాగిస్తేనే ... వాళ్ళ పొట్ట గడిచేది.

తీరా ఇంత కష్ఠ పడి యేదో వేటాడితే,
దొరికిన పంట కాస్త దొరలు (దళారులు)
యేదో కాస్త ముట్ట జెప్పి, పట్టుకు పొయి, సొమ్ము చేసుకుంటారు.

వీళ్ళ జీవితాలు మాత్రం, యెదుగు బొదుగు లేకుండ,
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు సాగి పొవలసిందే,
ఇదేనా! ఈ కష్ఠ జీవుల సమిష్ఠి కృషికి ఫలితం !!!!!!!!!!!


Saturday, February 20, 2010

డాక్టర్ బషీర్ గారి పది మినీ కవితలు

1)

నన్ను అమీబా లా ఎంచి
కాళ్ళతో తొక్కేవు
డైనోసార్ లా మారి
నిన్ను మింగేస్తాను


2)

నీరు దాహం ఉన్నవాడి కి
వరం
మునిగేవాడి కి
శాపం

3)

ఓటమి కాదు
గమ్యం
అది విజయానికి
సోపానం


4 )

నా గుండె లోని అగ్నిని
కాగితాల పై చల్లాను
బూడిదయ్యాయి

5)

పూజించే దేవుళ్ళు
నీల మేఘ శ్యాములు
భక్తులు కోరేవి తెల్ల ముఖాలు

6)

చట్టం
హింసను క్షమిస్తుంది
అహింసను శిక్షిస్తుంది

7 )

చదువు
జీవితం కోసమే కాక
జీవితం లోని మార్పుకు
దోహదం కావాలి

8 )

మనసు వెంటపడకుండా
మనసు వెంట తిప్పుకోగల
వాడే అసలైన-లీడర్

9 )

తోటివారికి అపకారం
చేయకపోవడమే
దేశసేవతో సమానం


10)

నవ్వు పెదవుల పై
వక్రించినను కొన్ని పనులను
లైన్ చేస్తుంది

Thursday, February 4, 2010

కవిత



(తేది 26-01-2010 న ఇండియన్ తెలుగు అసోషియేషన్ ద్వారా “తెలుగు తేజం” అవార్డు గ్రహీత “డాక్టర్ గజల్ శ్రీనివాస్” సన్మాన సభలో శాలువాతో సన్మానిస్తున్న డాక్టర్ యస్. బషీర్, శ్రీ యస్సీ వై నాయుడు మరియు శ్రీ రాజ శేఖర్)

తెలుగు తేజం గజల్ శ్రీనివాస్
- Dr. S. BASHEER, Chennai

తెలుగు వాళ్ళకు, తెలుగు గజల్స్ రంగు, రుచి, వాసన చూపించి,
తెలుగు గజల్స్ కు విశ్వ విఖ్యాతి కల్పించిన,
నిలువెత్తు సంతకం ఈ గజల్ శ్రీనివాస్.
గాంధీజీ సందేశాల్ని, 125 భాషల్లో పాడి, వినిపించి,
గాంధీజీ గోల్డెన్ డ్రీమ్స్ ఆల్బం విడుదల చేసి,
మహా శాంతి యాత్రలో ... సత్యం, శాంతి, ప్రేమ, సత్యాగ్రహాల
ఫిలాసఫీని దశ దిశల చాటుతున్న “మ్యాస్ట్రో గజల్ శ్రీనివాస్” కు
“తెలుగు తేజం” అవార్డు ఇచ్చిన శుభ సందర్భాన
మాహార్దిక శుభాభి వందనాలు
కోటి అభినందన చందనాలు.

Thursday, March 5, 2009

భర్తృహరి సుభాషితం

- మన్నవ గంగాధర్, చెన్నయ్.

విద్యనిగూఢగుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్
విద్యనృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే.

వ్యక్తికి విద్యయే ధనము, దాచి ఉంచగలిగినది అదియే, విద్య సకల భోగ కారకము, కీర్తి, సుఖము కలుగజేయును, విద్య గురువు వలె మార్గము చూపును, విదేశాలకు వెళ్లినపుడు చుట్టమువలె సాయపడును. విద్య కారణంగానే రాజ సత్కారాలు లభిస్తాయి, అటువంటి విద్య లేనివాడు మనిషే కాడు అని భర్తృహరి సుభాషితం.

Friday, October 31, 2008

కవిత kavita

అ మ ర జీ వి – స మ ర గా థ



- డా. యస్. బషీర్, చెన్నై




భారత స్వాతంత్ర్య చరిత్రలో గాంధీజీకి ఎంతటి ప్రాముఖ్యతున్నదో ఆంధ్ర రాష్ట్ర చరితలో. . . . . అమరజీవికి ఆంతటి పేరున్నది. “తెలుగు గాంధీ” గా ఖ్యాతిగాంచిన పొట్టి శ్రీరాముల పవిత్ర బలిదానం, అజరామరం! ఓ అమరకావ్యం! అనితర సాధ్యం! ఓ మహోదయం! నవోదయం! ఓ మహా సంగ్రామం!


అమరజీవి – సమర గాథ




భారత స్వాతంత్ర్య చరిత్రలో
గాంధీజీకి ఎంతటి ప్రాముఖ్యతున్నదో
ఆంధ్ర రాష్ట్ర చరితలో. . . . .
అమరజీవికి ఆంతటి పేరున్నది.
“తెలుగు గాంధీ” గా ఖ్యాతిగాంచిన
పొట్టి శ్రీరాముల పవిత్ర బలిదానం,
అజరామరం! ఓ అమరకావ్యం!
అనితర సాధ్యం! ఓ మహోదయం!
నవోదయం! ఓ మహా సంగ్రామం!
నేడు ఆంధ్ర రాష్ట్ర 53వ అవతరణ దినోత్సవం!
అమరజీవి నామస్మరణం,
సమరజీవి పవిత్రాత్మకు నివాళులర్పించడం,
ప్రతి తెలుగువాడి కర్తవ్యం !

అమరజీవి ఆశయాలను
తెలుగు జాతి, భాషా సంస్కృతులను
సత్యం, అహింసా, ధర్మాచరణాలను,
పరిరక్షించు కోవటం మన ధర్మం.
పొట్టివాడైనను గట్టివాడుగా
విలువైన ప్రాణాన్ని తృణప్రాయంగా యెంచి
లక్ష్యసాధనే ధ్యేయంగా పురోగమించిన
అమరజీవి ఆత్మ బలిదానం
విశ్వ స్వాతంత్ర్య చరిత్రలో
కనీ, వినీ, ఎరుగని సాహస ఘట్టం
తెలుగువారందరి మేలుకోరిన ఓ మహాయాగం!
తెలుగు జాతికి గౌరవం, గుర్తింపు కలిగించిన
పొట్టి శ్రీరాముల జీవిత చరిత్ర
ఇతిహాస పుటల్లో స్వర్ణాక్షరమయం
తెలుగుజాతి హృదయాల్లో శ్రద్ధాసుమాల ప్రళయం.
“పొట్టి శ్రీరాముల వంటి పదిమంది శిష్యులుంటే
సంవత్సర కాలంలో స్వరాజ్యం సంపాదించ గలనని” గాంధీజీకు ధీమా
కలిగించిన ధన్య జీవి! త్యాగ జీవి! కర్మయోగి!
భగీరధుడు, గంగను భువికి దించినట్లు
ఆంధ్ర రాష్ట్రమును సాధించిన ఘనుడు అమరజీవి.
నిజమైన దూరదర్శి! కార్యశీలి!

58 రోజులు నిరాహార దీక్షచేసి
అమరజీవి ఆత్మార్పణం
తెలుగు వారికయ్యింది వరప్రసాదం
ఓ త్యాగ శీలి . . .
నీ కలలను తెలుగువారు
చెయ్యాలి సఫలం! అదే పవిత్రాత్మకు బలం.
అమరజీవి దివ్య దృష్టి! పారదర్శకత,
లక్ష్యసిద్ధి, సంకల్పం, ఉద్యమస్పూర్తి,
తెలుగువారిని మేలుకొలిపి
ప్రసాదించె, నవచైతన్య స్ఫూర్తి!
ఓ అమరజీవి! నీకు జోహార్లు
ఓ సమరజీవి! నీకు శతకోటి వందనాలు
అభినందన చందనాలు.





*** *** ***





అంతరంగం ANTARAGAM









తెలుగుకు ప్రాచీన భాష హోదా
నవ్వడానికా? ఏడ్వటానికా?
(త్వరలో అంతరంగం లో చదవగలరు)

Wednesday, October 29, 2008

కవిత kavita

స్నేహా0జలీ – దీపావళి



- ఎస్.సి.వై. నాయుడు, చెన్నయ్



ఎ0తమధుర0 – ఈ స్నేహబ0ధ0
అపూర్వ0 – అనిర్వచనీయ0
మనోహర0 – అతి కమనీయ0
ఆకర్షణ0 – అతి రమణీయ0
అమరకావ్య0 – సుధారస భరిత0

ఈ దివ్య, నవ్య, రమ్య దీపావళి
ర0గు ర0గుల హరివిల్లు, కోటి కా0తులు వెదజల్లు
స్నేహ పరిమళ0, దీపాల కా0తిపు0జ0 జగమ0తా విరజిల్లు
అ0ధకార0పై విజయ0
సర్వత్రా స0ప్రదాయ పరమార్ధ0 చేకూరాలని,
దీపావళి శుభవేళ అక్షర దీపావళి వెలిగిస్తున్నాను
స్నేహ – ప్రేమ నమస్సుమా0జలి అ0దిస్తున్నాను.


***

Saturday, October 25, 2008

దీపావళి శుభాకాంక్షలతో...



దీపావళి శుభమస్తు



- డా. ఎస్. బషీర్, చెన్నయ్



దీపాల వెలుగులో జగమంతా మెరిసె
అష్టైశ్వర్యాలతో జనులందరూ మురిసె
పూల సుగంధాలు ప్రతి ముంగిట కురిసె
ఆనంద లాహిరిలో పుడమి పులకరించె
అందరి హృదయాలలో స్నేహభావాలు పలకరించె
ఈ దీపావళి సమస్త మానవాళికి
సుఖశాంతి సమృద్ధి ప్రసాదించె
ముక్కోటి దేవతలు ఒక్కటై ఆశీర్వదించె
తమసోమా జ్యోతిర్గమయ నినదిస్తూ
అజ్ఞానాంధకారాలు నశియించె
జడ సమాజంలో చైతన్యవాహిని ప్రవహించె
విశ్వ జనవాణిలో ఐక్యతాగీతం పరవశించె
దీపాల వెలుగులో, మతాబుల జిలుగులో
జగమంతయు సంగీతభరిత సుధారస గానమాయె.

Sunday, October 19, 2008

కవిత kavita


అమ్మాయిలు

- డా. బషీర్, చెన్నై


అమ్మాయిలు
కంటికి రూపాలు
ఇంటికి దీపాలు
ముఖారవిందాలు
దేవుడి వరాలు
కలవారికి ఐశ్వర్యాలు
లేనివారికి ఆత్మస్థైర్యాలు

అమ్మాయిలు
వాడని వసంతాలు
వీడని సుమధుర భావాలు
తరగని అమృతభాండాగారాలు
అమరప్రేమకు నిర్వచనాలు
జన్మ-జన్మల అనుబంధాలు

అమ్మాయిలు
ఆశయాలకు ప్రతిబింబాలు
ఆశలకు ఊపిరులు
అనురాగాలకు ముద్దుమురిపాలు
ఆప్తుల పెదవులపై చిరునవ్వులు
కుటుంభాలకు సజీవ ప్రతిరూపాలు

అమ్మాయిలున్న ఇళ్ళు
స్వర్గానికి నిలయాలు
మమతల కోవెలలు
సుఖశాంతుల లోగిలులు
లక్ష్మీసరస్వతుల సంగమాలు

అమ్మాయిలున్న ఇళ్ళు
కోటి దీపాల వెలుగులు
లక్ష తారకల జిలుగులు
సంగీత సుధారస భరితాలు
జననీ జనకుల జీవనసఫలాలు

అమ్మాయిలున్న ఇళ్ళు
ప్రతిరోజూ పండుగలు
హోళీ దసరా దీపావళీలు

అమ్మాయిలు జాతికి చిహ్నలు
దేశానికి గర్వకారణాలు
చరిత్రకు దర్పణాలు
నాగరికతకు కీర్తిపతాకాలు
దేశాభ్యుదయాని రథసారథులు

అమ్మాయిలే నాటికి నేటికి ఏనాటికి
తరగని కరగని అలుపెరగని అసమాన ధనులు
యోధులు, ధురంధరులు
అభిమానవతులు,
అజరఅమరఅఖిల జగాలలో
చరితార్థులు విద్యావేత్తలు
కారణజన్ములు
ప్రగతికి రథచక్రాలు
ఈ జగతికి సూర్యచంద్రులు

అమ్మాయిలే
సమస్తమానవాళికి
జీవనప్రదాతలు.

Thursday, August 14, 2008

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో....

పతాకావిష్కరణ
- మన్నవ గంగాధరప్రసాద్, చెన్నపురి.
నేను
విహంగాన్ని
అపరిమిత స్వేచ్ఛాతత్వాన్ని
సున్నిత హృదయసంబరాన్ని.
నేను
ఒక సామాన్య మానవుణ్ని
సతతకివితాగాన లోలున్ని
బాధాసర్గశత కావ్యాన్ని
ప్రతిరోజూ మరణించే ఉదయాణ్ని
కాగితంపై జీవించే కలాన్ని
కాలాన్ని జయించే బలాన్ని
మది పుష్పాలను పండించే పొలాన్ని
దుర్మార్గహనన యజ్ఞవాటిక సిద్దం చేసే హలాన్ని.
కల్మశోన్మాధ వ్యతిరేక సైన్యాల యుద్దగీతాన్ని
కలసి కలలుగనే మనసుల భవితకు మార్గాన్ని.
సంకుచిత మనోదుర్గుణాలను పెకలించే గునపాన్ని
సమాజవనిలోని క్రూర వృక్షాల దహించే.. దావానలాన్ని.