Saturday, March 6, 2010

కవిత

Photo: SCY Naidu

వాతావరణ కాలుష్యం


-యస్సీ వై నాయుడు, చెన్నై-SCY Naidu, Chennai



మండుటెండలో, ఎండిన కొమ్మలపై,
మాడే కడుపులతో, పండిన గింజల కోసం,
"కాకా" అంటూ కలయచూస్తున్న కాకమ్మలు....

వచ్చేది వసంత ఋతువైనా......
చిగుళ్ళకు నోచుకోని కొమ్మలు,
నలువైపులా చీకటి ముసురుకున్న మేఘాలు,
దట్టంగా వ్యాపించిన పొగలు,
ఎటు చూచినా ప్రకృతి వినాశకాలు,
ఇవన్నీ ఈవాతావరణ కాలుష్యానికి కారణాలు కావా???

ఇకనైనా మనం ఆలోచించాలి దీనికి "నివారణలు",
లేకుంటే జీవజాతి ఎదుర్కోవాలి ఎన్నో దుష్పరిణామాలు.
అందుకే వృక్షజాలను రక్షించండి !
పచ్చదనాన్ని సృష్టించండి!!


%%%%%%%%%

Monday, March 1, 2010

హోలీ శుభాకాంక్షలతో.....


కలకాలం తీపి జ్ఞాపకాలను మదిలో నింపుకుందాం


- డా. బషీర్, చెన్నై Dr. Basheer, Chennai

రసిక హృదయాల సంగీత జావళి
మతసామరస్యానికి రంగుల నివాళి
భావోద్వేగాల నిండుగా వెలిగే దీపావళి
రంగు రంగుల ఆనందాల పండుగ హోలీ

ఇంద్రధనస్సు భువిపై విరిజల్లు
అందాల ఆనందాల రంగుల చిరుజల్లు
సప్తవర్ణాల హోలీ హరివిల్లు
ప్రతిమదిలో భావానురాగాలు వెదజల్లు

పేద-ధనిక ,చిన్న-పెద్ద తేడాలేకుండా
రాగద్వేషాలకు అతీతంగా
సమసమాజానికి ప్రతీకగా
ఆత్మీయానురాగాలను పంచే ఈ పండుగ

బాధలను, బాధ్యతలను
కనీసం ఒక రోజైనా మరచి
ఆనందోత్సాహాల ద్వారా మురిసి
రంగులతో కొత్త హంగులతో మురిసి

అందరం కలిసి ఆనందంగా హోలీ జరుపుకుందాం
కలకాలం తీపి జ్ఞాపకాలను మదిలో నింపుకుందాం

Thursday, February 25, 2010

కవిత - కష్ట జీవుల సమిష్ఠి కృషి



కష్ట జీవుల సమిష్ఠి కృషి


- ఎస్.సి.వై. నాయుడు, చెన్నై


--SCY Naidu, Chennai--



కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు………………..
ఈ శ్రమ జీవులు ఇలా శ్రమించి,
సముద్రంలో వేట సాగిస్తేనే ... వాళ్ళ పొట్ట గడిచేది.

తీరా ఇంత కష్ఠ పడి యేదో వేటాడితే,
దొరికిన పంట కాస్త దొరలు (దళారులు)
యేదో కాస్త ముట్ట జెప్పి, పట్టుకు పొయి, సొమ్ము చేసుకుంటారు.

వీళ్ళ జీవితాలు మాత్రం, యెదుగు బొదుగు లేకుండ,
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు సాగి పొవలసిందే,
ఇదేనా! ఈ కష్ఠ జీవుల సమిష్ఠి కృషికి ఫలితం !!!!!!!!!!!


Tuesday, February 23, 2010

కవిత

మాతృభాష

- డాక్టర్ ఎస్. బషీర్, చెన్నై


తేనే లొలుకు మధుర భాష
వెన్న చిలుకు అమృత భాష
వెన్నెల పలుకుల జిలుగు భాష
ప్రతి పదం మకరందము చిలుకు
ప్రతి వాక్యం సరిగమలు పలుకు
అమ్మ మాటలోని కమ్మదనం
నాన్నబాటలోని ఆత్మబలం
భావితరాలకు ప్రేర్రణకు
ప్రగతిమార్గాన పయనించే
అందరికి అనురాగాలు పంచే
మాతృభాష సేవ ధన్యమురా !
మాతృదేవత,మాతృదేశం విలువ
విశ్వాన చాటారా !
తేజోమూర్తిగా విరాజిల్లరా !
వీరి సేవలు చేసిన జీవితమే ధన్యమురా !

అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా, శుభాకాంక్షలతో...
{ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం
నిర్వహించాలన్న బంగ్లాదేశ్ ప్రతిపాదనను యునెస్కో అంగీకరించింది ]

Saturday, February 20, 2010

డాక్టర్ బషీర్ గారి పది మినీ కవితలు

1)

నన్ను అమీబా లా ఎంచి
కాళ్ళతో తొక్కేవు
డైనోసార్ లా మారి
నిన్ను మింగేస్తాను


2)

నీరు దాహం ఉన్నవాడి కి
వరం
మునిగేవాడి కి
శాపం

3)

ఓటమి కాదు
గమ్యం
అది విజయానికి
సోపానం


4 )

నా గుండె లోని అగ్నిని
కాగితాల పై చల్లాను
బూడిదయ్యాయి

5)

పూజించే దేవుళ్ళు
నీల మేఘ శ్యాములు
భక్తులు కోరేవి తెల్ల ముఖాలు

6)

చట్టం
హింసను క్షమిస్తుంది
అహింసను శిక్షిస్తుంది

7 )

చదువు
జీవితం కోసమే కాక
జీవితం లోని మార్పుకు
దోహదం కావాలి

8 )

మనసు వెంటపడకుండా
మనసు వెంట తిప్పుకోగల
వాడే అసలైన-లీడర్

9 )

తోటివారికి అపకారం
చేయకపోవడమే
దేశసేవతో సమానం


10)

నవ్వు పెదవుల పై
వక్రించినను కొన్ని పనులను
లైన్ చేస్తుంది

Friday, February 12, 2010

Tuesday, February 9, 2010

FREE TREATMENT

If you know anyone who has met with a fire accident or people who are born with problems / disabilities such as jointed ear, nose and mouth, please note they can avail free plastic surgery at Pasam Hospital, KODAIKANAL from March 23rd to 4th April 2010 by German Doctors.>>
Address:>Pasam Hospital>M.M. Street,>Kodaikanal,>>
Phone: (04542) 240778 (04542) 240778 , 240668, 245732>
e-mail: pasam.vision@ gmail.com
>You can check the news on this link

http://www.thehindu.com/2009/01/11/stories/ 2009011151570300 .htm>>

Every thing is free!!( SBF - IS )

- RAMESH PRABHU, COCHIN