Saturday, September 12, 2009

మన తెలుగు

మన తెలుగు పద్యాలు

- మన్నవ గంగాధర్ ప్రసాద్, చెన్నై

కం. లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన దుదిన లోకం బగు పెం
జీకటి నెవ్వడు వెలిగెడు
నేకాకృతితోడ నతని నే సేవింతున్.

భావం-
సకల లోకాలు, దిక్పాలురు, జనులు అందరూ నశించిననూ, లోకాలనావహించిన కారు చీకటిలో సైతం జ్యోతిలా వెలుగొందే ఆ భగవంతుని నేను సేవింతును.


( గజేంద్రమోక్షంలోని పద్యం ఇది)

Friday, August 7, 2009

కవిత kavitha

రక్షా బంధన్


Dr. S. Basheer, Chennai


ప్రేమామృత-మమతాను బంధాల మధుర పర్వమిది.
అన్నా- చెల్లెళ్ళ, అక్కా- తమ్ముళ్ళ, రక్షా కవచ మిది.
మధురం, సుమధురం ఈ అన్నాచెల్లెళ్ళ అనురాగ బంధం.
రక్త సంభంధాలకు ఆయువు, ఈ జన్మజన్మల సంబంధం.
ఉత్తర భారతీయుల ప్రాముఖ్య పండుగ ఆనాడు.
అన్ని మతాలవారు జరుపుకునే ఆత్మీయత పండుగ ఈనాడు.
కుటుంబ సభ్యుల సన్నిధిలో జరిగే ఈ రాఖీ పండుగ,
అన్న, చెల్లెళ్ళ కిచ్చే కానుకల పెన్నిధి నిండుగా.
అన్నా- చెల్లెళ్ళ అనుబంధాలకు ప్రతీక.
జన్మజన్మల సంబంధాలకు స్మారిక.
జగతిన ఆనందోత్సవాలతో వెలిగే దీపిక.
ఈ రాఖీ పండుగ అష్టైశ్వర్యాలను అందిస్తుంది నిండుగా.
“రక్షా బంధన్”గా ప్రసిద్ధిగాంచిన ఈ పండుగ,
“వృక్షా బంధన్”గా యువతరాన్ని ఆకట్టు కుంటున్నది,
“గ్లోబలైజేషన్” ప్రాముఖ్యత దశ దిశల చాటు తున్నది.
***************

Wednesday, August 5, 2009

కావడి – కుండలు

కావడి – కుండలు

“కావడి కొయ్యేనోయ్ ... కుండలు మన్నేనోయ్”
అని దాదాపు 50 సంవత్సరాల క్రితం,
శ్రీ ఘంటసాల గారు దేవదాసు చిత్రంలో పాడారు.
ఇది ఒకప్పటి సినిమా పాట .... పాత నానుడి. అందరికీ తెలిసిందే. . . . . .
మరి ఈ నూతన యుగంలో క్రొత్త నానుడి ఏమిటో సరదాగా కాస్త చూద్దామా !!!!!!!!
క్రింది చిత్రం చూడండి మీకే తెలుస్తుంది ...............
కావడి మాత్రం కొయ్యగానే వుంది కుండలు మాత్రం మారి పోయాయి.
--యస్సీవై నాయుడు, చెన్నై--





Monday, June 29, 2009

చెన్నై తెలుగు జర్నలిస్టులకు కంప్యూటర్ శిక్షణ

సాహితి సంపాదకులు డా. సి. జయ శంకర్ బాబు 28 జూన్ 2009 న చెన్నై తెలుగు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో తెలుగు జర్నలిస్టులకు కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పై ఈనాడు, సాక్షి దిన పత్రికలలో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ సాహితి పాఠకుల కొరకు ...

(సౌజన్యం - సాక్షి - ఈ-పేపర్)




(సౌజన్యం - ఈనాడు - ఈ-పేపర్)




Friday, May 22, 2009

బాల సాహితి BALA SAHITI


కవిత

ఉయ్యాల


- సి. విజయేంద్ర బాబు, 4వ తరగతి


పార్కులో ఉయ్యాల ఊగుతున్నప్పుడు


గాలిలో తేలుతున్నట్టు


నింగిలో ఎగురుతున్నట్టు


విమానాలను పట్టుకున్నట్టు


పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు


ఎన్నెన్నో అనుభవాలు...


అలా చూస్తూ ఉంటే పచ్చని చెట్లు


దూరాన ఉన్న కొండలు అన్నీ


నా కళ్ళముందే ఉన్నట్టనిపిస్తుంది


పచ్చని చెట్లపై కిలకిలరవాలు చేస్తున్న పక్షుల్లా


మనసంతా ఆనందమయమే.